స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-08-12T23:48:58+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్‌లు అమ్మకాల ఒత్తడికి

స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్‌లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ ఇవాళ 37 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ సైతం 14 పాయింట్ల నష్టంతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 37.38 పాయింట్లు (0.10 శాతం) నష్టంతో 38369.63 వద్ద క్లోజ్ అయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 14.10 పాయింట్లు (0.12 శాతం) క్షీణించి 11308.40 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, టెక్ మహింద్రా తదితర షేర్లు నిఫ్టీలో లాభం నమోదు చేయగా... కొటాక్ మహింద్రా, సిప్లా, హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్ తదితర షేర్లు నష్టాలు నమోదు చేశాయి.

Updated Date - 2020-08-12T23:48:58+05:30 IST