కరోనా భయాలను తొక్కేసిన ఐటీ షేర్లు.. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..

ABN , First Publish Date - 2020-07-17T23:09:28+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ దిగ్గజాలు లాభాలు నమోదు చేస్తుండడంతో..

కరోనా భయాలను తొక్కేసిన ఐటీ షేర్లు.. లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ దిగ్గజాలు లాభాలు నమోదు చేస్తుండడంతో ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం పడినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా మూడో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ లాభాలను ప్రకటించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 1.5 శాతం మేర ఎగబాకాయి. దేశంలో కరోనా కేసులు 10 లక్షలు దాటాయన్న భయాలు సైతం లాభాల ధాటికి కొట్టుకుపోవడం గమనార్హం. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 548.46 పాయింట్ల (1.50 శాతం) లాభంతో 37,020.14 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 161.75 పాయింట్లు (1.51 శాతం) బలపడి 10,901.70 వద్ద క్లోజ్ అయ్యింది. ఇక ఈ వారం లాభాల విషయానికి వస్తే.. సెన్సెక్స్ 425.81 పాయింట్లు (1.16 శాతం) ఎగబాకగా.. నిఫ్టీ 133.65 పాయింట్లు (1.24 శాతం) బలపడింది. మొత్తంగా దేశీయ మార్కెట్లు లాభాలతో ముగియడం వరుసగా ఇది ఐదో వారం కావడం గమనార్హం. 

Updated Date - 2020-07-17T23:09:28+05:30 IST