ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరాని (2002-23)కి ఈక్విటీ మార్కెట్ శుభారంభం అందించింది. విదేశీ నిధుల రాక, విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల ఉత్తేజంతో స్టాక్ మార్కెట్ కదం తొక్కింది. సెన్సెక్స్ మరోసారి కీలకమైన 59000 పాయింట్ల పైన స్థిరపడింది. ఇంట్రాడేలో 828.11 పాయింట్ల వరకు లాభపడి 59396.62 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరికి 708.18 పాయింట్ల లాభంతో 59276.69 వద్ద క్లోజైంది. నిఫ్టీ 205.70 పాయింట్ల లాభంతో 17670.45 వద్ద ముగిసింది. వారం మొత్తంలో సెన్సెక్స్ 1914.49 పాయింట్లు, నిఫ్టీ 517.45 పాయింట్లు లాభపడ్డాయి.