Teenmar Mallanna పై సంచలన ఆరోపణలు...

ABN , First Publish Date - 2021-08-29T14:05:54+05:30 IST

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తీన్మార్‌ మల్లన్న నిర్వహిస్తున్న....

Teenmar Mallanna పై సంచలన ఆరోపణలు...

  • ‘అక్రమ సంపాదన కోసమే తీన్మార్‌ మల్లన్న బహుజన వాదం’


హైదరాబాద్ సిటీ/కృష్ణానగర్‌ : తీన్మార్‌ మల్లన్న చేస్తున్న దందాలు తాము ఇప్పటికే ప్రజల ముందు పెట్టామని క్యూ న్యూస్‌ మాజీ బ్యూరో చీఫ్‌ చిలుక ప్రవీణ్‌ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తీన్మార్‌ మల్లన్న నిర్వహిస్తున్న క్యూ న్యూస్‌ యూట్యూబ్‌ చానల్‌ మాజీ ఉద్యోగులు, ఆయన వెంట నడిచిన కార్యకర్తలతో కలిసి ప్రవీణ్‌ విలేకరులతో మాట్లాడారు. మల్లన్నకు బహుజనవాదం తెలియదని, కేవలం డబ్బు సంపాదన కోసమే ఆయన బహుజనవాదం, జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుంటారని ఆరోపించారు. లక్ష్మీకాంత్‌ అనే స్వామీజీ నుంచి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసి ఆయన్ను బెదిరించగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కార్యక్రమంలో క్యూ న్యూస్‌ చానల్‌ మాజీ ఉద్యోగులు పాల్గొన్నారు.



14 రోజుల రిమాండ్..

కాగా.. బెదిరింపు కేసులో అరెస్టయిన తీన్మార్‌ మల్లన్నకు సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వారాసిగూడకు చెందిన సన్నిధానం లక్ష్మీకాంత్‌ శర్మను బెదిరించారంటూ కేసు నమోదవడంతో శుక్రవారం రాత్రి తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే మెజిస్ట్రేట్‌ నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. శనివారం ఉదయం సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు. 9వరకు రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశించారు.

Updated Date - 2021-08-29T14:05:54+05:30 IST