Fixed deposits: సీనియర్ సిటిజన్లకు ఇదే సరైన సమయం.. 6 రోజుల్లో ముగిసిపోనున్న స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్

ABN , First Publish Date - 2022-09-24T23:01:03+05:30 IST

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో(Fixed deposites) డబ్బుపై వడ్డీ లభించడంతోపాటు చక్కటి భద్రత ఉంటుంది.

Fixed deposits: సీనియర్ సిటిజన్లకు ఇదే సరైన సమయం.. 6 రోజుల్లో ముగిసిపోనున్న స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో(Fixed deposites) డబ్బుపై(Money) వడ్డీ(Interest) లభించడంతోపాటు చక్కటి భద్రత ఉంటుంది. ఈ కారణంగానే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అమితాధరణ ఉంటుంది. అయితే వడ్డీ రేట్లు గరిష్ఠంగా ఉన్న సమయంలో ఎఫ్‌డీ చేసుకోవడం మరింత ప్రయోజనకరం. బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆఫర్లు ఇచ్చినప్పుడు త్వరపడితే మెరుగైన ఫలితం ఉంటుంది. అలా ప్రత్యేక ఎఫ్‌డీ ఆఫర్లు కోసం ఎదుచూస్తున్న వృద్ధులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) ప్రత్యేక ఎఫ్‌డీ ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే మరో 6 రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 30తో ముగిసిపోనున్న స్కీమ్‌ల ప్రత్యేకత, వివరాలపై మీరూ తెలుసుకోండి..


ముగింపు తేదీలివే..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC bank), ఐడీబీఐ(IDBI) బ్యాంకుల సీనియర్ సిటిజన్స్ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్(FD schemes) గడువు తేదీ సెప్టెంబర్ 30, 2022న ముగుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI bank) ప్రత్యేక సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ స్కీమ్ ‘గోల్డ్ ఇయర్స్ ఎఫ్‌డీ’ అక్టోబర్ 7, 2022న ముగియనుండగా.. ఎస్‌బీఐ ప్రత్యేక సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు తేదీని మార్చి 2023 వరకు పొడగించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక స్కీమ్‌ల ప్రత్యేకతలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం...


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ కేర్ ఎఫ్‌డీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ డేటా ప్రకారం.. సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతమున్న 0.50 శాతం ప్రీమియం కంటే అదనంగా 0.25 శాతం ఎక్కువ వడ్డీని అందించనుంది. రూ.5 కోట్ల లోపు మొత్తాన్ని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీ చేస్తే ఈ ప్రీమియం లభిస్తుందని వివరించింది. మే 2020లో ప్రారంభించిన ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 30, 2022న ముగుస్తుందని వెల్లడించింది. రెన్యూవల్ చేసుకునేవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ స్కీమ్ ఎన్నారైలకు వర్తించదు.


ఐడీబీఐ బ్యాంక్ నమన్ డిపాజిట్..

ఐడీబీఐ బ్యాంక్ నమన్ డిపాజిట్స్ పథకంలో సీనియర్ సిటిజన్లు 0.75 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2022 వరకు మాత్రమే ఉంది. 


ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ..

ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం... రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లు ఎఫ్‌డీపై 0.20 శాతం అదనపు వడ్డీని పొందొచ్చు. అయితే పరిమితి కాలపు ఎఫ్‌డీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్ గడువు అక్టోబర్ 7, 2022 వరకు మాత్రేమే ఉంది.

Updated Date - 2022-09-24T23:01:03+05:30 IST