JIPMERలో సీనియర్‌ రెసిడెంట్‌లు

ABN , First Publish Date - 2021-12-01T17:51:43+05:30 IST

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌..

JIPMERలో సీనియర్‌ రెసిడెంట్‌లు

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్మర్‌) - ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. పుదుచ్చేరి, కరైకల్‌ కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


మొత్తం ఖాళీలు: 58 (పుదుచ్చేరిలో 40, కరైకల్‌లో 18)

విభాగాలు: అనెస్థీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, జీరియాట్రిక్‌ మెడిసిన్‌, నియోనాటాలజీ, గైనకాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహెబిలిటేషన్‌, ఫిజియాలజీ, ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌, పల్మనరీ మెడిసిన్‌, రేడియేషన్‌ అంకాలజీ, రేడియో డయాగ్నసిస్‌

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2022 జనవరి 31 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌: పరీక్ష సమయం గంట. ఇందులో 40 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. ఈ టెస్ట్‌కి 80, ఇంటర్వ్యూకి 20 మార్కులు కేటాయించారు.

ఒప్పంద వ్యవధి: మూడేళ్లు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 14

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడింగ్‌: డిసెంబరు 21 నుంచి 

పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, పుదుచ్చేరి

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ తేదీ: డిసెంబరు 26

ఇంటర్వ్యూకి ఎంపికైనవారి జాబితా విడుదల: 2022 జనవరి 3

ఇంటర్వ్యూలు: 2022 జనవరి 10, 11

వెబ్‌సైట్‌: www.jipmer.edu.in

Updated Date - 2021-12-01T17:51:43+05:30 IST