Abn logo
Sep 20 2020 @ 15:56PM

మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేతకు కరోనా

Kaakateeya

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. తనకు కరోనా వైరస్ సోకినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆదివారం ట్వీట్ చేశారు. కరోనా సోకినట్లు శనివారం సాయంత్రం తన నివేదికలు వచ్చిన తరువాత తాను ఐసోలేషన్‌ లో ఒంటరిగా ఉన్నానని సుధీర్ అన్నారు. గత కొద్ది రోజులుగా తనతో పరిచయం ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 58 ఏళ్ల బల్లార్‌పూర్ ఎమ్మెల్యే గత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆర్థిక, అటవీ మంత్రిగా ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement