చిన్న రైతుల పొట్టకొడుతున్నారు.. వ్యవసాయ బిల్లులపై కపిల్ సిబల్ ధ్వజం..

ABN , First Publish Date - 2020-09-21T22:06:08+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర వ్యతిరేకత...

చిన్న రైతుల పొట్టకొడుతున్నారు.. వ్యవసాయ బిల్లులపై కపిల్ సిబల్ ధ్వజం..

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. వీటి వల్ల లక్షలాది మంది నిరుపేద రైతులు నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీవ్ర ఆందోళన, నిరసనల మధ్య నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో సిబల్ స్పందిస్తూ.. ‘‘వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పడ్డాయి. కాంట్రాక్టు వ్యవసాయాన్ని చట్టబద్ధం చేశారు. దీని వల్ల నిజంగా లాభపడేది ఆదానీ, అంబానీలూ.. కేంద్ర ప్రభుత్వమే. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఉపసంహరించుకుంటుంది కాబట్టి ఎఫ్‌సీఐ కూడా లాభపడుతుంది. ఇక ఎటొచ్చీ నష్టపోయేది లక్షలాది మంది నిరుపేద రైతులే.. ’’ అని ట్వీట్ చేశారు. కనీసం బేరమాడే సామర్థ్యం లేకపోవడం వల్ల పేద రైతులు దారుణంగా నష్టపోతారని కపిల్ సిబల్ పేర్కొన్నారు.



Updated Date - 2020-09-21T22:06:08+05:30 IST