Abn logo
Jul 8 2020 @ 17:59PM

అనారోగ్యంతో వెంటిలేటర్‌పై ప్రముఖ నటి జయంతి

బెంగళూరు: దక్షిణాది సినీ రంగంలోని సీనియర్ నటి జయంతి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం జయంతి బెంగళూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ఉన్నారు. దక్షిణాదిలో తెలుగు, కన్నడం, తమిళం, మలయాళ రంగాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ జయంతి నటించారు. ప్రత్యేకించి కన్నడ సినీ రంగంలో ఆమెకి మంచి గుర్తింపు లభించింది. పలు పురస్కారాలు ఆమెను వరించాయి. తెలుగులో ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖ హీరోల సరసన జయంతి నటించారు.

Advertisement
Advertisement
Advertisement