Abn logo
Sep 18 2020 @ 15:57PM

హాస్పిటల్‌లో సీనియర్‌ నటుడు

Kaakateeya

సీనియర్‌ నటుడు, దర్శకుడు రామరాజన్‌(60) శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. ఆయనకు కరోనా సోకిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్‌లో చేర్పించారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకిన లక్షణాలు కనిపించాయని, దీంతో రామరాజన్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారని అంటున్నారు. కరోనా నెగటివ్‌ అని వస్తే ఆయన్ని డిశ్చార్జ్‌ చేస్తారని ఆసుపత్రి వర్గాలంటున్నాయి. రామరాజన్‌ నటుడిగానే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవమే కాదు.. దర్శకుడిగానూ కొన్ని సినిమాలను తెరకెక్కించారు. 


Advertisement
Advertisement