Abn logo
Mar 2 2021 @ 04:56AM

అమితాబ్ మూవీపై జోకేసిన యాక్టర్.. ట్విట్టర్లో వైరల్

ముంబై: బాలీవుడ్ చరిత్రలో భారీ హిట్ చిత్రాల్లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటించిన ‘సూర్యవంశం’ ఒకటి. 1999లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. తాజాగా ఈ సినిమాను ఓ టీవీ ఛానెల్‌లో ప్రసారం చేస్తుశారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన సదరు టీవీ ఛానెల్ సినిమా గురించి ఓ ప్రశ్న వేసింది. దీన్ని చూసిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ‘‘హా హా హా... ఈ సినిమా చాలా ఎక్కువగా చూపించేశారు. ఎంతలా అంటే చంద్రుడిపై జీవించే వాళ్లు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తారు’’ అంటూ చమత్కరించాడీ సీనియర్ యాక్టర్.

Advertisement
Advertisement
Advertisement