Abn logo
Mar 27 2020 @ 04:26AM

మమ్మల్ని స్వస్థలాలకు పంపించండి

హాస్టళ్లు, హోటళ్ల మూసివేతతో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన


మహారాణిపేట, మార్చి 26: లాక్‌డౌన్‌ దృష్ట్యా హోటళ్లు, హాస్టళ్లు మూసి వేసిన నేపథ్యంలో తమను స్వస్థలాలకు పంపించాలని కొందరు ప్రైవేటు ఉద్యోగులు గురువారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము వేర్వేరు ఊర్ల నుంచి వచ్చి ఎంవీపీ కాలనీ, ద్వారకానగర్‌ జంక్షన్లలోని హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నామని, తమలో కొందరు బీచ్‌ రోడ్డులోని స్టార్‌ హోటల్‌లో పని చేస్తున్నారని, వీటిని మూసి వేస్తున్నట్టు అకస్మాత్తుగా ప్రకటించి బయటకు పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఉండాలో తెలియడం లేదని, విశాఖలో చిక్కుకుపోయామన్నారు. కలెక్టర్‌ తమ బాధలను అర్థం చేసుకుని స్వస్థలాలకు పంపించాలని కోరారు.

Advertisement
Advertisement
Advertisement