మీ ‘వెలుగు జ్యోతి’ని ఏబీఎన్‌కు పంపండి.. ప్రపంచానికి మేం చూపిస్తాం

ABN , First Publish Date - 2020-04-05T19:11:33+05:30 IST

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో మరోసారి ‘జనతా’ స్ఫూర్తిని ప్రదర్శించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించాలంటూ దేశ ప్రజలను ఆయన కోరారు.

మీ ‘వెలుగు జ్యోతి’ని ఏబీఎన్‌కు పంపండి.. ప్రపంచానికి మేం చూపిస్తాం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో మరోసారి ‘జనతా’ స్ఫూర్తిని ప్రదర్శించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించాలంటూ దేశ ప్రజలను ఆయన కోరారు. ప్రధాని ఇచ్చిన పిలుపుపై దేశ వ్యాప్తంగా చాలామంది స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది కొవ్వొత్తులు, దీపాలు సిద్ధం చేసుకుంటున్నారు. 


ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల ఐక్యతను చూపించాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్ణయించింది. ప్రేక్షకులు కూడా ఇందులో భాగస్వాములు కావాలంటే.. ఆదివారం రాత్రి మీరు వెలిగించే దీపాలు, మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుగుల్ని మాతో పంచుకోండి.. మీ వెలుగుజ్యోతి వీడియోలు, సెల్ఫీలను #ABNAndhrajyothy సోషల్ మీడియా ఖాతాలకు ట్యాగ్ చేయండి. మీ వెలుగు జ్యోతిని ప్రపంచానికి మేం చూపిస్తాం.

Updated Date - 2020-04-05T19:11:33+05:30 IST