గూగుల్‌పేతో అమెరికా నుంచి డబ్బులు పంపొచ్చు

ABN , First Publish Date - 2021-05-13T11:28:41+05:30 IST

అమెరికాలోని వారు భారత్‌కు డబ్బులు పంపడం మరింత సులభంగా మారింది. అమెరికాలోని గూగుల్‌పే వినియోగదారులు భారత్‌తోపాటు సింగపూర్‌లోని యూజర్లకు ఇక డబ్బులు పంపించవచ్చు. ఈ సదుపాయం వల్ల ఎంతో మందికి ప్రయోజనం కలగనుంది. ఈ సదుపాయం కల్పించడానికి వెస్టర్న్‌ యూనియన్‌, వైజ్‌లతో గూగుల్‌పే కలిసి పని చేస్తోంది.

గూగుల్‌పేతో అమెరికా నుంచి డబ్బులు పంపొచ్చు

న్యూఢిల్లీ: అమెరికాలోని వారు భారత్‌కు డబ్బులు పంపడం మరింత సులభంగా మారింది. అమెరికాలోని గూగుల్‌పే వినియోగదారులు భారత్‌తోపాటు సింగపూర్‌లోని యూజర్లకు ఇక డబ్బులు పంపించవచ్చు. ఈ సదుపాయం వల్ల ఎంతో మందికి ప్రయోజనం కలగనుంది. ఈ సదుపాయం కల్పించడానికి వెస్టర్న్‌ యూనియన్‌, వైజ్‌లతో గూగుల్‌పే కలిసి పని చేస్తోంది. ఈ ఏడాది చివరినాటికి యూఎస్‌ గూగుల్‌ పే వినియోగదారులు వెస్టర్న్‌ యూనియన్‌ ద్వారా 200కు పైగా దేశాలకు, వైజ్‌ ద్వారా 80కి పైగా దేశాలకు డబ్బులు పంపగలరని భావిస్తున్నట్టు గూగుల్‌పే బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. చాలా మంది తమ స్వదేశాలకు నగదును తరచుగా పంపుతుంటారని, దీన్ని తాము మరింత సులభతరం చేస్తున్నట్టు పేర్కొంది. 


Updated Date - 2021-05-13T11:28:41+05:30 IST