సెంబ్‌కార్ప్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ మెడికల్‌ సేవలు

ABN , First Publish Date - 2021-10-29T05:00:11+05:30 IST

సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉచిత మొబైల్‌ మెడికల్‌ సేవలను అందజేస్తున్నామని సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ ప్లాంట్‌ హెడ్‌ రమేష్‌ రామన్‌ తెలిపారు.

సెంబ్‌కార్ప్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ మెడికల్‌ సేవలు
మొబైల్‌ సేవలు ప్రారంభిస్తున్న సెంబ్‌కార్ప్‌ ప్లాంట్‌ హెడ్‌ రమేష్‌ రామన్‌

ముత్తుకూరు, అక్టోబరు 28: సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉచిత మొబైల్‌ మెడికల్‌ సేవలను అందజేస్తున్నామని సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ ప్లాంట్‌ హెడ్‌ రమేష్‌ రామన్‌ తెలిపారు. గురువారం మండలంలోని పైనంపురంలో థర్మల్‌ కేంద్రం వద్ద ఆయన మొబైల్‌ మెడికల్‌ వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సేవలను ప్రారంభించామన్నారు. సెంబ్‌కార్ప్‌ ఆర్థిక సాయంతో వొకర్డ్‌ ఫౌండేషన్‌ మెడికల్‌ సేవలను అందజేస్తుందన్నారు. వైద్య సేవలు అందుబాటులో లేని మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందజేయాలన్న లక్ష్యంతో ఈ మొబైల్‌ మెడికల్‌ వ్యాన్‌ కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. వ్యాన్‌లో ఎంబీబీఎస్‌ డాక్టర్‌తో పాటు ఫార్మసిస్ట్‌ అందుబాటులో ఉంటారన్నారు.  ప్రజలకు ఉచిత వైద్యసేవలతో పాటు అవసరమైన మందులను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ కేంద్రం ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:00:11+05:30 IST