సేమ్యా ఉప్మా

ABN , First Publish Date - 2021-01-16T20:10:59+05:30 IST

సేమ్యా అనగానే పాయసం గుర్తొస్తుంది. కానీ సేమ్యాతో నోరూరించే ఉప్మా, దోశలు కూడా చేసుకోవచ్చు. రాగి సేమ్యా, లెమన్‌ వెర్మిసెల్లీ వంటి రెసిపీలు బ్రేక్‌ఫాస్ట్‌లో తినడానికి బాగుంటాయి. కొత్త రుచులు ఆస్వాదించాలంటే ఈ వంటకాలను ప్రయత్నించండి.

సేమ్యా ఉప్మా

వావ్‌...వెర్మిసెల్లీ!

సేమ్యా అనగానే పాయసం గుర్తొస్తుంది. కానీ సేమ్యాతో నోరూరించే ఉప్మా, దోశలు కూడా చేసుకోవచ్చు. రాగి సేమ్యా, లెమన్‌ వెర్మిసెల్లీ వంటి రెసిపీలు బ్రేక్‌ఫాస్ట్‌లో తినడానికి బాగుంటాయి.  కొత్త రుచులు ఆస్వాదించాలంటే ఈ వంటకాలను ప్రయత్నించండి.


కావలసినవి: సేమ్యా - ఒక కప్పు, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - రెండు రెమ్మలు, వేరుసెనగలు - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం ముక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - చిటికెడు, క్యారెట్‌ - ఒకటి, క్యాప్సికం - ఒకటి, బీన్స్‌ - మూడు, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిబఠాణీ - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్‌, క్యాప్సికం కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. తరువాత మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించుకోవాలి. కాసేపు వేగిన తరువాత వేరుసెనగలు వేసి చిన్నమంటపై వేగనివ్వాలి. అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిబఠాణీలు, క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, బీన్స్‌ వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మరికాసేపు ఉడికించాలి. తరువాత సేమ్యా వేసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసుకుని, నిమ్మరసం పిండి సర్వ్‌ చేసుకోవాలి. అల్పాహారంగా, సాయంత్రం స్నాక్స్‌గా దీన్ని తీసుకోవచ్చు.


Updated Date - 2021-01-16T20:10:59+05:30 IST