మత్తుపదార్థాల సమస్యలపై రేపు సదస్సు

ABN , First Publish Date - 2022-06-25T08:56:28+05:30 IST

తెలంగాణ సర్కారు విచ్చలవిడి మద్యం ద్వారా తన ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో..

మత్తుపదార్థాల సమస్యలపై రేపు సదస్సు

తెలంగాణ సర్కారు విచ్చలవిడి మద్యం ద్వారా తన ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విపరీతంగా బార్లకు, పబ్‌లకు, రెస్టారెంట్లకు, బెల్ట్ షాపులు (అనధికార) అనుమతిచ్చింది. అనుమతి ఇచ్చేటప్పుడు ఉన్న శ్రద్ధ వాటి నియంత్రణలో సర్కారు చూపడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం 30–32 పబ్బులుంటే, నేడు వాటి సంఖ్య 100కి పైగా ఉంది. వైన్ షాప్స్ 2,216 నుంచి 2,620కి, బార్లు 1,060 నుంచి 1,220కి పెరిగాయి. లిక్కర్ ఆదాయం 10,800 కోట్ల నుంచి 31 వేల కోట్లకు పెరిగింది. పబ్బులు, వైన్ షాప్స్, బార్లలో 70 శాతానికి పైగా రాజకీయ నాయకులు లేదా వాళ్ళ అనుచరులే నడిపిస్తున్నారు. పల్లెల నుంచి పట్నం వరకు మద్యం ఏరులై పారుతోంది. ఇవే గాక గంజాయి వంటి మత్తుపదార్థాలు విరివిగా దొరుకుతున్నాయి. దీంతో యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి అడ్డదారిన డబ్బుల కోసం నేరాలకు పాల్పడుతున్నారు. అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో అఖిలపక్షం సమావేశం జరుగుతుంది.


– డాక్టర్ బి. కేశవులు

తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్

Updated Date - 2022-06-25T08:56:28+05:30 IST