తెలంగాణ కథపై సదస్సు

ABN , First Publish Date - 2021-08-09T06:20:13+05:30 IST

ఆగస్టు 12, 13 తేదీల్లో నల్లగొండ కథా పాఠశాల ప్రథమ వార్షికోత్సవం సంద ర్భంగా రెండు రోజులు సా.6గం.లకు జూమ్‌ ఆన్‌లైన్‌ వేదికగా సదస్సు ఉంటుంది...

తెలంగాణ కథపై సదస్సు

ఆగస్టు 12, 13 తేదీల్లో నల్లగొండ కథా పాఠశాల ప్రథమ వార్షికోత్సవం సంద ర్భంగా రెండు రోజులు సా.6గం.లకు జూమ్‌ ఆన్‌లైన్‌ వేదికగా సదస్సు ఉంటుంది. మొదటిరోజు ముఖ్యఅతిథి నందిని సిధారెడ్డి. వక్తలుగా అంబల్ల జనార్థన్‌ ‘ప్రవాస తెలంగాణ కథ’ అంశంపైన, ఎలికట్టె శంకర్‌ రావు ‘తెలంగాణ కథ - రైతుజీవితం’ అంశంపైన, తండు కృష్ణకౌండిన్య ‘బి.ఎస్‌.రాములు కథలు-సామాజికత’ అంశంపైన, కోట్ల వనజాత ‘తెలంగాణ కథ-స్త్రీ జీవితం’ అంశంపైన ప్రసం గిస్తారు. రెండవ రోజు ముఖ్య అతిథి బి.వి.ఎన్‌. స్వామి. వక్తలుగా గడ్డం మోహన్‌ రావు ‘తెలంగాణ దళిత కథ’ అంశంపై, షాజహానా ‘తెలంగాణ ముస్లింవాద కథ’ అనే అంశంపై ప్రసంగిస్తారు. వివరాలకు: 99853 89506.

పెరుమాళ్ళ ఆనంద్‌

Updated Date - 2021-08-09T06:20:13+05:30 IST