మానవ వికాసానికే శాస్త్ర విజ్ఞానం

ABN , First Publish Date - 2022-08-10T06:24:53+05:30 IST

జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణ్వాయుధ దాడి జరిగి 77 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్‌) ఆధ్వర్యంలో మంగళవారం పటమట రైతుబజారు వద్ద శ్రీ విశ్వభారతి హైస్కూల్‌లో విద్యార్థులకు యుద్ధాల వల్ల కలిగే అనర్థాలపై సదస్సు నిర్వహించారు.

మానవ వికాసానికే శాస్త్ర విజ్ఞానం
మాట్లాడుతున్న ఇస్కఫ్‌ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌

 మానవ వికాసానికే శాస్త్ర విజ్ఞానం

పటమట, ఆగస్టు 9: జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణ్వాయుధ దాడి జరిగి 77 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్‌) ఆధ్వర్యంలో మంగళవారం పటమట రైతుబజారు వద్ద శ్రీ విశ్వభారతి హైస్కూల్‌లో విద్యార్థులకు యుద్ధాల వల్ల కలిగే అనర్థాలపై సదస్సు నిర్వహించారు. ప్రధాన అధ్యాపకులు పొట్లూరి మురళీ ప్రసంగిస్తూ శాస్త్రవిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఆ విజ్ఞానాన్ని మానవ వికాసానికి కాక మానవాళి వినాశనానికి ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక నాయకులు, న్యాయవాది ఓలేటి శివప్రసాద్‌ మాట్లాడుతూ మండవ ప్రపంచ యుద్ధం వస్తే ఒక్క జీవరాశి కూడా ఉండదన్నారు. ఇస్కఫ్‌ అధ్యక్షుడు పరుచూరి అజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి మోతుకూరి అరుణ్‌కుమార్‌లు మాట్లాడుతూ ఇస్కఫ్‌ గత 80 ఏళ్లుగా ప్రపంచ దేశాల మధ్య శాంతి స్నేహ సంబంధాలు కోసం పని చేస్తున్న సంఘం అని వివరించారు. ఇస్కఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌.పిచ్చయ్య అభ్యుదయ గేయాలు ఆలపించారు.

Updated Date - 2022-08-10T06:24:53+05:30 IST