Abn logo
Aug 13 2020 @ 16:47PM

ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను: సెల్వ రాఘవన్

`7/జి బృందావన కాలనీ`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` వంటి సినిమాలతో తెలుగు వారిని కూడా మెప్పించాడు తమిళ దర్శకుడు సెల్వరాఘవన్. ఇప్పటివరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన సెల్వ రాఘవన్ లాక్‌డౌన్‌ కారణంగా లభించిన విరామ సమయంలో యాక్టివ్ అయ్యారు. ట్విటర్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు. 


ట్విటర్ ద్వారా ఇటీవల అభిమానులతో సెల్వ రాఘవన్ చిట్‌చాట్ చేశారు. `గడచిన కాలంలో ఓ రోజు మళ్లీ తిరిగొచ్చే అవకాశం వుంటే మీరు ఏ రోజును కోరుకుంటార`ని ఓ అభిమాని ప్రశ్నించారు. `సంధ్యా సమయంలో స్నేహితులతో మాట్లాడుతుండగా.. కాస్త దూరంలో తండ్రి నీడను చూసి ఇంటికి పరుగెత్తుకెళ్లి.. తల్లి పెట్టిన భోజనం తిని, ఏ దిగులూ లేకుండా నిదురపోయిన రోజునే మళ్లీ కోరుకుంటాన`ని సెల్వ చెప్పారు. అలాంటి మధుర క్షణాలను ఎప్పటికీ మరువలేనని ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement