ఐడీసీఎంఎస్‌కు ధాన్యం విక్రయించం

ABN , First Publish Date - 2021-10-25T05:25:37+05:30 IST

ముత్తకుంట సొసైటీ పరిధిలోని మల్లారం గ్రామ రైతులు వరి ధాన్యం ఎట్టి పరిస్థితిల్లో సొసైటీకి తప్ప ఐడీసీ ఎంఎస్‌కు అమ్మబోమని రైతులు తీర్మానించారు. ఆదివారం రూరల్‌ మండలంలోని మల్లారం గ్రామంలో ఐడీసీఎంఎస్‌ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాల్సి ఉంది. చైర్మన్‌ సాంబారి మోహన్‌ చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభం కావాలి. అయితే ఆదివారం ఉదయం

ఐడీసీఎంఎస్‌కు ధాన్యం విక్రయించం
మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

నిజామాబాద్‌ రూరల్‌, అక్టో బరు 24: ముత్తకుంట సొసైటీ పరిధిలోని మల్లారం గ్రామ రైతులు వరి ధాన్యం ఎట్టి పరిస్థితిల్లో సొసైటీకి తప్ప ఐడీసీ ఎంఎస్‌కు అమ్మబోమని రైతులు తీర్మానించారు. ఆదివారం రూరల్‌ మండలంలోని మల్లారం గ్రామంలో ఐడీసీఎంఎస్‌ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాల్సి ఉంది. చైర్మన్‌ సాంబారి మోహన్‌ చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభం కావాలి. అయితే ఆదివారం ఉదయం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు వచ్చి గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. గతేడాది ఐడీసీఎంఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు జరిపారని, 40కిలోల బ్యాగ్‌కు 4నుంచి 6కిలోల వరకు తరుగు, తాలు పేరుతో తమకు దోపిడీ చేశారని మండిపడ్డారు. డబ్బులు కూడా సరైన సమయంలో ఇవ్వలేదన్నారు. రసీదు పుస్తకం మీద కాకుండా, కేవలం తెల్లపేపరుపై రాసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఏఈవో, ఐసీడీఎంఎస్‌ అధికారులు రైతుల గోడును ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు ఆందోళన చేపట్టారు. ఒకవేళ తమ ధాన్యం  అమ్మాల్సివస్తే ముత్తకుంట సొసైటీకి మాత్రమే అమ్ముకుంటామని, లేదంటే ప్రైవేట్‌వారికి అమ్ముతామని స్థానిక ప్రజాప్రతినిదులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక సర్పంచ్‌, వైస్‌ ఎంపీపీ, ఇతర నాయకుల చెప్పినా శాంతించలేదు. చివరకు మల్లారం గ్రామంలో ఆదివారం జరగాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రం రద్దు అయ్యింది.  

Updated Date - 2021-10-25T05:25:37+05:30 IST