నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు

ABN , First Publish Date - 2020-06-05T10:32:33+05:30 IST

నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి 


నల్లగొండ క్రైం, సూర్యాపేట క్రైం, జూన్‌ 4: నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, పోలీస్‌ అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాల విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోవిడ్‌-19ను అరికట్టడంలో పోలీసులు, కీలకంగా పని చేశారని అన్నారు. కరోనాతో ప్రస్తుతం సహజీవనం చేయాల్సి వస్తోందని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు విధి నిర్వహణ చేయాలన్నారు. అన్ని పోలీ్‌సస్టేషన్లలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు. పోలీ్‌సస్టేషన్లకు ఆక్సీమీటర్లు అందించనున్నామని, వీటీ ద్వారా ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. నల్లగొండ ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ మాట్లాడుతూ, నకిలీ పత్తి విత్తనాలపై పటిష్ఠ నిఘా ఏర్పాటుచేశామని, వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.


సరిహద్దుల వద్ద నిఘా పెంచడంతో పాటు గత ఏడాది కేసులు నమోదు చేసిన వ్యక్తుల కదలికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సూర్యాపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల అమ్మకంపై ఐదేళ్లుగా రెండు కేసులు నమోదయ్యాయని, వ్యవసాయ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో నల్లగొండ ఏఎస్పీలు సీ.నర్మద, సతీష్‌, ఎస్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సూర్యాపేట స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌, సుధాకర్‌, గోవిందరావు, రామారావు, నగేష్‌, రజింత్‌రెడ్డి, బాలూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T10:32:33+05:30 IST