స్వశక్తితో జీవించే వారే పెరికలు : ఎంపీ బడుగుల

ABN , First Publish Date - 2021-10-20T06:30:23+05:30 IST

ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించే వారే పెరిక కులస్థులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పెరిక సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆయన మాట్లాడారు. అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

స్వశక్తితో జీవించే వారే పెరికలు : ఎంపీ బడుగుల
పెరిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

సూర్యాపేటటౌన్‌, అక్టోబరు 19 : ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించే వారే పెరిక కులస్థులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పెరిక సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆయన మాట్లాడారు. అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పెరిక కులస్థులంతా ఐక్యంగా తమ హక్కులను సాధించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేల కోట్లను బడుగు బలహీనవర్గాల కోసమే ఖర్చు చేస్తుందన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ బీసీ బంధును ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. మంత్రి జగదీ్‌షరెడ్డి సహకారంతో జిల్లాకేంద్రంలో పెరిక కులస్థుల సంఘం భవనానికి 5 ఎకరాలలోపు  స్థలం కేటాయింపునకు కృషి చేయడంతో పాటు తననిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ విద్యతోనే ఏదైనా సాధ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. విద్యను ఆయుధంగా అందుకున్నప్పుడే ఎదుగుదల ఉంటుందన్నారు. దేశంలో కులం అనేది ఉనికి, గుర్తింపు, రక్తబాంధవ్యమని తెలిపారు. రాష్ట్రంలో 9శాతం ఉన్న కులాలు పాలించడానికి కారణం మనలో ఉన్న నిర్వహణలోపమేనన్నారు. పెరిక కులానికి గుర్తింపులేదని, ఇప్పటి వృత్తి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ఉన్న పెరిక కులస్థుల టీచర్లు, పోలీ్‌సఆఫీసర్లు రాష్ట్రంలో ఎక్కడాలేరని, ఇది ఈ జిల్లాకే గర్వకారణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్‌ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ పెరిక కులస్థుల కోసం పెరిక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల నాగార్జున, రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు మద్ద లింగయ్య, జిల్లా అధ్యక్షుడు వనపర్తి లక్ష్మినారాయణ, కోదాడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష, సముద్రాల రాంబాబు, శ్రీరాం, దయానంద్‌,  రామకృష్ణ, వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌వర్మ, నాగేందర్‌, అజయ్‌, కృష్ణయ్య, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, బుర్రి శ్రీరాములు, బసవయ్య, నాగేశ్వర్‌రావు, శ్యాం సుందర్‌, అచ్చయ్య, వేణుధర్‌, సత్యనారాయణ, కోటేశ్వర్‌రావు, మధు, ఆనంద్‌, వీరయ్య, మల్లిఖార్జున్‌, హన్మంతు, శ్రీనివాస్‌, రామలింగయ్య పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా వనపర్తి లక్ష్మీనారాయణ

సూర్యాపేట టౌన్‌ / పెన్‌పహాడ్‌ : పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోదాడకు చెందిన వనపర్తి లక్ష్మీనారాయణతో పాటు ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేటకు చెందిన సముద్రాల రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా పెన్‌పహాడ్‌ మండలం లింగాల గ్రామానికి చెందిన గార్లపాటి స్వర్ణ నియమితులయ్యారు. ఈ మేరకు సూర్యాపేటలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. 




Updated Date - 2021-10-20T06:30:23+05:30 IST