OBC, దళితుల్లో కూడా స్వార్థపరులకు కొదవలేదు: Mayawati

ABN , First Publish Date - 2022-07-18T01:47:40+05:30 IST

దళిత, వెనుకుబడిన వర్గాల్లో కూడా స్వార్థపరులకు కొదవ లేదు, అందులో నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఉన్నారు. నేను లేనప్పుడు ఢిల్లీలోని నా నివాసంపై సీబీఐ దాడులు జరిపి కుటుంబంతో సహా వెళ్లిపోయిన వ్యక్తి కూడా ఉన్నాడు. అప్పటి నుంచి తమ్ముడు ఆనంద్, తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబంతో కలిసి నాకు మద్దతుగా పార్టీ పనుల్లో

OBC, దళితుల్లో కూడా స్వార్థపరులకు కొదవలేదు: Mayawati

న్యూఢిల్లీ: దళితులు, వెనుకబడిన (SC, ST, OBC) వర్గాల్లో కూడా స్వార్థపరులకు కొదవలేదని, అందులో తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి(Bahujan Samaj Party Supremo Mayawati) అన్నారు. కాన్షీరాం స్థాపించిన BAMCEF, DS4 సంస్థల్ని బీఎస్పీయేతరులు నడిపిస్తుండడాన్ని ఆమె తప్పు పట్టారు. వారి ఎవరి పేర్లు ఎత్తకుండా విమర్శలు గుప్పించారు. వెనుకబడిన వర్గాల్లోని స్వార్థపరులకు తమ స్వప్రయోజనాల కోసం మనువాదులకు మేలు చేసే విధంగా దళిత, వెనుకబడిన వర్గాల ఓట్లను చీల్చేందుకు పేపర్ సంస్థల్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల్లోని కొంత మంది నుంచి మాయావతిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. కాగా, వీటిపై ఎప్పుడూ పెద్దగా స్పందించని మాయావతి మొదటిసారి ట్విట్టర్ వేదికగా ఆదివారం వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.


‘‘దళిత, వెనుకుబడిన వర్గాల్లో కూడా స్వార్థపరులకు కొదవ లేదు, అందులో నా కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఉన్నారు. నేను లేనప్పుడు ఢిల్లీలోని నా నివాసంపై సీబీఐ దాడులు జరిపి కుటుంబంతో సహా వెళ్లిపోయిన వ్యక్తి కూడా ఉన్నాడు. అప్పటి నుంచి తమ్ముడు ఆనంద్, తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబంతో కలిసి నాకు మద్దతుగా పార్టీ పనుల్లో నిమగ్నమయ్యాడు. స్వార్థపరులు ప్రత్యేకించి బామ్‌సెఫ్(BAMCEF), డీఎస్4(DS4) తదితర పేర్లతో అనేక రకాల పేపర్‌ సంస్థలను సృష్టించి, సామాజిక స్పృహ కల్పించే ముసుగులో తమ స్వార్థాన్ని రుజువు చేసుకుంటున్నారు. బీఎస్పీలోని కొందరు నిష్క్రియులు కూడా ఈ పని చేశారు. ఇది దురదృష్టకరం. బీఎస్పీని నిర్వీర్యం చేసేందుకు కులతత్వ శక్తులు ఇలా తెరవెనుక కుట్రలు పన్నుతున్నాయి. ఇలాంటి కాగితపు పార్టీలను ఉపయోగించుకుని చేసి ఎన్నికల్లో దళితులు, దోపిడీకి గురైన వారి ఓట్లను చీల్చేందుకు ఘోరమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ, ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మాయావతి ట్వీట్లు చేశారు.

Updated Date - 2022-07-18T01:47:40+05:30 IST