Selfie గొరిల్లా కన్నుమూత... నెటిజన్ల ఆవేదన

ABN , First Publish Date - 2021-10-07T02:08:26+05:30 IST

మౌంటేన్ గొరిల్లా చనిపోయిందని విరుంగ నేషనల్ పార్క్ ప్రకటించింది. ఈ విషయం తెలిసి బాదేసింది. దాకాసితో 10 ఏళ్ల పాటు అనుబంధం ఉన్న పార్కులోని యాజమాన్యానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఒక నెటిజెన్ స్పందించగా..

Selfie గొరిల్లా కన్నుమూత... నెటిజన్ల ఆవేదన

కిన్షా: ఇద్దరు రేంజర్లతో రెండు గొరిల్లాలు సెల్ఫీ దిగిన ఫొటో అప్పట్లో ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయింది. అయితే తాజాగా అందులో ఒక గొరిల్లా చనిపోయినట్లు కాంగోలోని విరుంగ నేషనల్ పార్క్ యాజమాన్యం తెలిపింది. దాకాసి, దేజే అనే ఈ రెండు గొరిల్లాలు 2019 నెట్టింట్లో మొదటిసారి ప్రత్యక్షమయ్యాయి. ఆ రెండు గొరిల్లాలు సెల్ఫీకి ఇస్తున్న ఫోజు చూసి నెటిజెన్లు మురిసిపోయారు. అయితే సెప్టెంబర్ 26న దాకాసి (14) చనిపోయిందట. కాస్త ఆలస్యంగా తెలిసినప్పటికీ దాకాస మరణించిందని తెలిసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు.


‘‘మౌంటేన్ గొరిల్లా చనిపోయిందని విరుంగ నేషనల్ పార్క్ ప్రకటించింది. ఈ విషయం తెలిసి బాదేసింది. దాకాసితో 10 ఏళ్ల పాటు అనుబంధం ఉన్న పార్కులోని యాజమాన్యానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఒక నెటిజెన్ స్పందించగా.. ‘‘దాకాసి చనిపోయిందని తెలిసి ఏడుపు ఆగలేదు. తను ఆ దేవుని చేతుల్లో సేద తీరుతూ ఉంటుంది’’ అని మరో నెటిజెన్ రాసుకొచ్చారు.

Updated Date - 2021-10-07T02:08:26+05:30 IST