సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్‌

ABN , First Publish Date - 2021-10-27T07:20:55+05:30 IST

సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్‌తో ట్రాఫిక్‌ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు.

సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్‌
వాహనంపై మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌

ట్రాఫిక్‌ను ఈజీగా క్లియర్‌ చేయొచ్చు

దీన్ని సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్‌ అంటారు. ఈ చిన్న వాహనం ఉంటే చాలు.. ట్రాఫిక్‌ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. గంటసేపు రీచార్జి చేస్తే 32 కిలోమీటర్లు దీనిపై ప్రయాణించవచ్చు. అలాగే బ్రహ్మోత్సవాలు వంటివి జరిగేటప్పుడు భద్రత పర్యవేక్షణకు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 


బాంబ్‌ డిస్పోజల్‌ సూట్‌: సిబ్బంది ప్రాణాలకు రక్షణ కవచం

దీన్ని బాంబ్‌ డిస్పోజల్‌ సూట్‌ అంటారు. బాంబులు, ల్యాండ్‌మైన్స్‌ వంటివి నిర్వీర్యం చేసేటపుడు ఈ సూట్‌ను పోలీసు సిబ్బంది ధరిస్తారు. ఒకవేళ బాంబు పేలినా సిబ్బంది ప్రాణాలకు రక్షణ కవచంగా ఈ సూట్‌ ఉంటుంది. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆయుధాల ప్రదర్శనలో వీటి పనితీరుపై విద్యార్థులకు ఏఆర్‌ సిబ్బంది తెలియజేశారు. మంగళవారం జిల్లా పోలీస్‌ ఏఆర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ప్రారంభించారు. ఏఎస్పీ డీఎన్‌ మహేష్‌, సీసీఎస్‌ డీఎస్పీ మూర్తి, చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

- చిత్తూరు

Updated Date - 2021-10-27T07:20:55+05:30 IST