Abn logo
May 11 2021 @ 15:29PM

సెల్ఫ్‌ లాక్‌డౌన్ ప్రకటించిన సిద్దిపేట గ్రామస్తులు

సిద్ధిపేట: జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో సెల్ఫ్‌ లాక్‌డౌన్ అమలు చేయాలని సిద్ధిపేట జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలోని అన్ని గ్రామాలు స్వీయ నియంత్రణ పాటిస్తూ సెల్ఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి. కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అందుకే స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement