ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గం

ABN , First Publish Date - 2021-01-24T05:30:00+05:30 IST

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించటం కష్టం కాదని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కృష్ణవేణి పేర్కొన్నారు. రెడ్‌క్రాస్‌ సేవా వారోత్సవాలలో భాగంగా ఆదివా రం ఒంగోలులోని రెడ్‌క్రాస్‌ భవనంలో ఏర్పాటుచేసిన మేము విజేతలం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గం
కమిషనర్‌ కృష్ణవేణిని సత్కరిస్తున్న ప్రకాష్‌బాబు

డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కృష్ణవేణి 


ఒంగోలు(కల్చరల్‌), జనవరి 24: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించటం కష్టం కాదని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కృష్ణవేణి పేర్కొన్నారు. రెడ్‌క్రాస్‌ సేవా వారోత్సవాలలో భాగంగా ఆదివా రం ఒంగోలులోని రెడ్‌క్రాస్‌ భవనంలో ఏర్పాటుచేసిన  మేము విజేతలం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సు మారు 200 మంది విభిన్న ప్రతిభావంతులను ఉద్ధేశించి ఆమె ప్రసంగి స్తూ దివ్యాంగులను ప్రోత్సహిస్తే అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారన్నారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ప్రకాష్‌బాబు మాట్లాడుతూ శరీర వైక ల్యం గురించి ఆలోచించకుండా జీవితంలో లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సాయిజనార్థన్‌, ఎంవీకే.ప్రసాద్‌, ఎం.రవీం ద్ర, డాక్టర్‌ జి.రవికుమార్‌, సోమినేని సురేష్‌, వీవీ.రమణ, ఎ.బ్రహ్మయ్య, డాక్టర్‌ బెజవాడపవన్‌కుమార్‌, డ్రీమ్స్‌ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-24T05:30:00+05:30 IST