రాష్ట్ర టెన్నీకాయిట్‌ పోటీలకు వడ్డాది విద్యార్థిని ఎంపిక

ABN , First Publish Date - 2022-07-06T06:59:15+05:30 IST

వడ్డాది కేఏడీ జడ్పీ హైస్కూల్‌కి చెందిన పదవ తరగతి విద్యార్థిని బి.హేమ రాష్ట్రస్థాయి టెన్నీకాయిట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైంది.

రాష్ట్ర టెన్నీకాయిట్‌ పోటీలకు వడ్డాది విద్యార్థిని ఎంపిక
హేమను అభినందిస్తున్న ఉపాధ్యాయులు


బుచ్చెయ్యపేట,జూలై 5: వడ్డాది కేఏడీ జడ్పీ హైస్కూల్‌కి చెందిన పదవ తరగతి విద్యార్థిని బి.హేమ రాష్ట్రస్థాయి టెన్నీకాయిట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైంది. ఈనెల 4వ తేదీన అనకాపల్లి అంబేడ్కర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో జరిగిన ఎంపిక పోటీలో హేమ సత్తా చాటింది. దీంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కాకినాడలో జరగనున్న ఛాంపియన్‌ షిప్‌ పోటీలో హేమ పాల్గొంటుందని పీడీ కడగళ్ల నారాయణమ్మ తెలిపారు. హేమను ఇన్‌చార్జి హెచ్‌ఎం వి.అప్పారావు, పీఈటీ అప్పలనాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు. 

Updated Date - 2022-07-06T06:59:15+05:30 IST