Abn logo
Oct 23 2021 @ 00:43AM

రాష్ట్ర జూడో జట్టుకు కేజీబీవీ విద్యార్థుల ఎంపిక

తాడిమర్రి, అక్టోబరు 22: జిల్లా స్థాయి జూడో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి  కేజీ బీవీకి చెందిన విద్యార్థులు ఓవ రాల్‌ చాంపియన్‌షిప్‌ సాధిం చారు. అనంత పురంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో శుక్రవారం జరిగిన జూడో పోటీల్లో  10వ త రగతి చదువుతున్న తీర్తి, అఖిల, దేవశ్రీ, 7వతరగతి చదువు తున్న భార్గవిలు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు పీఈటీ కవిత తెలిపా రు. తాడిమర్రి పాఠశాల నుండి 12మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొనగా నలు గురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపట్ల పాఠశాల ఎస్‌ఓ కళావతి విద్యా ర్థులను అభినందనలు తెలియజేశారు.