రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-02-25T04:59:15+05:30 IST

ఆర్మూర్‌లోని సాంఘిక సంక్షేమ పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల సాఫ్ట్‌బాల్‌ ప్రబబుల్స్‌ జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా సాప్ట్‌బాల్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి మా ర్కంటి గంగామోహన్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక


ఆర్మూర్‌రూరల్‌, ఫిబ్రవరి23: ఆర్మూర్‌లోని సాంఘిక సంక్షేమ పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల సాఫ్ట్‌బాల్‌ ప్రబబుల్స్‌ జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా సాప్ట్‌బాల్‌ అసో సియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి మా ర్కంటి గంగామోహన్‌ తెలిపారు. ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ శిబిరం నిర్వహించి ఇరు జట్లను ఎంపిక చేస్తామన్నారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి మహబూబాబాద్‌ జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలో వీరు పాల్గొంటారని తెలి పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, జిల్లా పీఈటీల సంఘం ప్రధానకార్యదర్శి మల్లేష్‌గౌడ్‌, బెస్‌బాల్‌ జిల్లా సంఘం ప్రధానకార్యదర్శి నరేంద్రచారి, తదితరులు పాల్గొన్నారు. 

మహిళల జట్టుకు 30మంది ఎంపిక 

డిచ్‌పలి, ఫిబ్రవరి24: జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్‌ విభాగంలో 30మందిని బుధవారం ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపిక చేసినట్లు జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, కార్యదర్శి గంగామోహన్‌ తెలిపారు. సుద్దపల్లిలో ఎంపిక జరిగిందని, ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-02-25T04:59:15+05:30 IST