Abn logo
May 28 2020 @ 03:29AM

అధికార పార్టీ కనుసన్నల్లో లబ్ధిదారుల ఎంపిక

  • అర్హులందరికీ రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి..
  • సీపీఐ నాయకుల ఆందోళన

అనంతపురంరూరల్‌, మే27: ఇళ్ల స్థలాల అర్హుల ఎంపిక అధికార పార్టీ కనుసన్నల్లో సాగుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు మల్లికార్జున విమర్శించారు. అర్హులందరికీ రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలంటూ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఐ మండల శాఖ, ఆర్డీఓ కార్యాలయం వద్ద నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు మల్లికార్జున, కార్యవర్గసభ్యులు కేశవరెడ్డి, లింగమయ్య, నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడారు. వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతోందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సెంటు, గ్రామాల్లో కాస్త ఎక్కువగా కేటాయిస్తోందన్నారు. అంత తక్కువ స్థల ంలో ఇల్లు ఎలా కట్టుకుంటారో ప్రజాప్రతినిధులే చెప్పాలన్నారు. ఇందులోనూ రాజకీయం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులే కార్యాలయాల్లో కూర్చుని, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం నాయకులు ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement
Advertisement
Advertisement