సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న నేపథ్యంలో ఆయన తాజాగా ఓటు యొక్క విశిష్టతను తెలుపుతూ.. ఓ వీడియోని విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే మంచి నాయకుడు, మంచి పాలన ప్రజలకు అందుతుందని తెలిపారు. హైదరాబాద్ అంటే ప్రేమ చూపించే వారంతా ఖచ్చితంగా ఓటు వేసి, ఆ ప్రేమను తెలియజేయాలని కోరారు. ఓటు మన హక్కు, మన బాధ్యత అంటూ జీహెచ్ఎంసీ చేస్తున్న క్యాంపెయిన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మన హైదరాబాద్, మా సిటీ, ఆప్నా హైదరాబాద్.. అని నిజంగా మనం మన నగరాన్ని ప్రేమిస్తే.. మనం తప్పుకుండా ఓటేయ్యాలి. ఎందుకంటే మన నగరానికి మంచి పాలన అవసరం. కాబట్టి అందరూ డిసెంబర్ 1న మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఓటేద్దాం..'' అని శేఖర్ కమ్ముల ఈ వీడియోలో తెలిపారు.