అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

ABN , First Publish Date - 2022-05-28T04:12:24+05:30 IST

ఆసిఫాబాద్‌ రేంజ్‌ పరిధిలో గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఆసిఫాబాద్‌ ఎఫ్‌ఆర్వో అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలం చింతల మాదర నుంచి గోలేటి వైపు కలప తరలిస్తున్న క్వాలిస్‌ వాహనాన్ని అటవీ అధికారులు వెంబడించారు.

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
పట్టుకున్న కలపతో అటవీశాఖ అధికారులు

తిర్యాణి, మే 27: ఆసిఫాబాద్‌ రేంజ్‌ పరిధిలో గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఆసిఫాబాద్‌ ఎఫ్‌ఆర్వో అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలం చింతల మాదర నుంచి గోలేటి వైపు కలప తరలిస్తున్న క్వాలిస్‌ వాహనాన్ని అటవీ అధికారులు వెంబడించారు. అధికారుల కళ్లుగప్పి వాహనాన్ని ఖైరిగూడ ఓపెన్‌కాస్టు గనుల ప్రాంతంలో వదిలిపెట్టి పారిపోయారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. వాహనంలో రూ.94వేల విలు వైన 21దుంగలను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అయన తెలిపారు. దాడుల్లో డీఆర్వో ప్రవీణ్‌కుమార్‌, తిర్యాణి సెక్షన్‌అధికారి మహెందర్‌, ఎఫ్‌బీవోలు స్వప్న, ప్రకాష్‌, అనిల్‌, పార్థు, నరేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T04:12:24+05:30 IST