Advertisement
Advertisement
Abn logo
Advertisement

గంజాయి మొక్కల స్వాధీనం

పరిగి: పత్తిపంటలో సాగు చేసిన గంజాయి మొక్కలను మంగళవారం పరిగి ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన పరిగి రాములు,  జాఫర్‌పల్లి గ్రామానికి చెందిన లాలయ్య తమ పొల్లాల్లో పత్తిపంటలో గంజాయి మొక్కలను పెంచారు.  విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.  ఇరువురి పొలాల్లో 20కిపైగా గంజాయి మొక్కలు లభించాయి. వీటి విలువ రూ.30 వేలకుపైగా ఉంటుందని ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. రాములు, లాలయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement