Abn logo
Sep 21 2021 @ 21:21PM

విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

విశాఖ: జిల్లా గుండా తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనంతగిరి మండలంలోని జూనియర్ కాలేజ్ జంక్షన్ వద్ద  పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 620 కేజీల గంజాయిని అనంతగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన హకీముద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని సీఐ జీడి బాబు తెలిపారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, లారీని  స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని అరకులోయ సీఐ బాబు పేర్కొన్నారు. ఈ గంజాయిని ఒరిస్సాలోని పాడవా నుంచి హర్యానాకు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో  గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని సీఐ బాబు చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...