కల్తీ వంట నూనె పట్టివేత

ABN , First Publish Date - 2022-05-23T06:15:40+05:30 IST

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో కల్తీ వంట నూనె నిల్వ చేసిన ప్రాంతాలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడిచేశారు.

కల్తీ వంట నూనె పట్టివేత
కల్తీ నూనెను చూపుతున్న అధికారులు

400 లీటర్ల నూనె స్వాధీనం చేసుకున్న అధికారులు 

చిట్యాలరూరల్‌, మే 22: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో కల్తీ వంట నూనె నిల్వ చేసిన ప్రాంతాలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడిచేశారు. ఈ ఘటనలో 400 లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వంటనూనెను కల్తీచేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎంఏ ఖలీల్‌, జీఎ్‌ఫఐ ఫ్లయింగ్‌స్క్వాడ్‌ ధర్మేంద్రపాల అధికారుల బృందం పెద్దకాపర్తిశివారులో రహదారి పక్కన గల లక్ష్మీతిరుపతమ్మ హోటల్‌పై దాడిచేసింది. హోటల్‌లోని ఓ గదిలో పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కల్తీ వంటనూనె కన్పించింది. అధికారులు వాటిని పరిశీలించి, డ్రమ్ముల్లో సుమారు 400 లీటర్ల కల్తీ వంటనూనె స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కోదాడకు చెందిన సామ్యేల్‌ అనే వ్యక్తి నూనెను నిల్వ చేశాడని, చిన్నచిన్న హోటళ్లకు దానిని విక్రయించేందుకు నిల్వచేసి ఉండవచ్చని, పట్టుబడిన నూనెను సీజ్‌ చేశామని, నమూనాలను హైదరాబాద్‌లోని స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.   

Updated Date - 2022-05-23T06:15:40+05:30 IST