Abn logo
Oct 20 2021 @ 00:55AM

30 లీటర్ల సారా స్వాధీనం: ఒకరి అరెస్టు

నిందితుడు బాబు

గుడిపాల, అక్టోబరు 19: 197 రామాపురం సమీపంలో 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాసనపల్లె, 197 రామాపురం పరిసర ప్రాంతాల్లో వంద లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. అనంతరం 197 రామా పురానికి చెందిన బాబు వద్దనుంచి 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశామని చెప్పారు. మరో నిందితుడు సురేష్‌ పరారయ్యాడన్నారు. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. మండలంలో ఎక్కడైనా సారా తయారు చేసినా, విక్రయించినా పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు.