పోలీసులకు పట్టుబడిన ఇసుక టైరు బండ్లు
చోడవరం, మే 19 : మండలంలోని గజపతినగరం శారదా నదిలో అక్ర మంగా ఇసుక తవ్వుతున్న 23 టైరు బండ్లను గురువారం సాయంత్రం తహసీల్దార్ బి.తిరుమలబాబు దాడి చేసి పట్టుకున్నారు. ఒక్కో టైరు బండి యజమానికి ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. నది నుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇదిలావుంటే, గజపతినగరంలో గత కొద్దిరోజులుగా నది నుంచి టైరు బండ్ల ద్వారా ఇసుకను తవ్వి రాత్రి వేళల్లో లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు టైరు బండ్ల యజమానులను హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది.