Abn logo
Apr 12 2021 @ 15:31PM

భారీగా వెండి పట్టివేత

కర్నూలు: అనుమతి పత్రాలు సరిగా లేకుండా తరలిస్తున్న వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్‌ బస్సులో తరలిస్తున్న 23 కిలోల వెండిని ఈ తనిఖీల్లో పట్టుకున్నారు. పట్టుకున్న వెండి విలువ దాదాపు 11 లక్షల రూపాయల విలువ ఉంటుందని భావిస్తున్నారు. వెండిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.