1.8 కిలోల బంగారు నగల స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-13T05:56:03+05:30 IST

కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ పోలీసులు 1.8 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

1.8 కిలోల బంగారు నగల స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగలు

కర్నూలు, జూన్‌ 12: కర్నూలు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ పోలీసులు 1.8 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ జిలానీబాషా సిబ్బందితో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదు నుంచి కర్నూలు వైపు వస్తున్న ఓ వాహనాన్ని ఆపి సోదాలు చేయగా బంగారు నగలు బయటపడ్డాయి. సత్యనారాయణ అనే వ్యక్తి వీటిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాదులోని శ్రీ బాలాజీ జువెలర్స్‌ నుంచి కర్నూలుకు ఈ బంగారు నగలు తరలిస్తున్నట్లు తేలింది. వీటి మార్కెట్‌ ధర రూ.1.8 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సత్యనారాయణ అదుపులోకి తీసు కుని తాలుకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి నట్లు సీఐ తెలిపారు. నిందితుడిది కర్నూలు నగరంలోని చింతలముని నగర్‌.  

Updated Date - 2021-06-13T05:56:03+05:30 IST