Abn logo
Sep 16 2021 @ 23:52PM

17 బస్తాల చౌక బియ్యం పట్టివేత

పట్టుబడిన బియ్యంతో పాటు ఆటో

చెన్నూరు, సెప్టెంబరు 16: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 17 బస్తాల చౌక బియ్యా న్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... గురువారం రాత్రి చెన్నూరు బుడ్డాయపల్లె వద్ద తమ సిబ్బందితో వాహనా ల తనిఖీ చేపట్టామన్నారు. అదే సమయంలో కడప నుంచి మైదుకూరు వైపు వెళుతున్న ఆటోలో 17 బస్తాల చౌక బియ్యం వుండగా పట్టుకున్నామని తెలిపారు. ఆటోను సీజ్‌ చేసి డ్రైవర్‌ మహబూబ్‌బాషను అరెస్టు చేశామన్నారు.