Jammu Police Station : జప్తు చేసిన వాహనాలు అగ్నికి ఆహుతి

ABN , First Publish Date - 2022-06-05T19:01:11+05:30 IST

జమ్మూ-కశ్మీరులోని సత్వరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న

Jammu Police Station : జప్తు చేసిన వాహనాలు అగ్నికి ఆహుతి

జమ్మూ : జమ్మూ-కశ్మీరులోని సత్వరి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జప్తు చేసిన వాహనాలు అగ్నికి ఆహుతి అయినట్లు పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు. దాదాపు ఏడు కార్లు, సుమారు 12 ద్విచక్ర వాహనాలు కాలిపోయాయని తెలిపారు. ఓవర్‌హెడ్ పవర్ లైన్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఈ వాహనాలు కాలిపోయినట్లు చెప్పారు. 


పోలీసులు జప్తు చేసిన ఈ వాహనాలను పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరుబయట ఉంచారు. శనివారం-ఆదివారం మధ్య రాత్రి 1.50 గంటలకు ఓవర్‌హెడ్ పవర్ లైన్ తెగిపోవడంతో అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసు అధికారులు తెలిపారు. నాలుగు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్ భవనానికి మంటలు వ్యాపించకుండా నిరోధించగలిగారని తెలిపారు. 


అగ్నిమాపక అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో ఏడు కార్లు, సుమారు 12 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. 


Updated Date - 2022-06-05T19:01:11+05:30 IST