Abn logo
Sep 26 2021 @ 00:38AM

50 కిలోల గంజాయి స్వాధీనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న లిక్విడ్‌ గంజాయి బాటిల్స్‌, గంజాయి బస్తా

సింహాచలం, సెప్టెంబరు 25: జీవీఎంసీ 98వ వార్డు పరిధి పాత అడవివరం కూడలి వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు 50 కిలోల గంజాయితో పాటు రెండు లీటర్ల లిక్విడ్‌ గంజాయిని సీఐలు పి.అప్పలరాజు, ఎన్‌.గణేశ్‌లు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సింహాచలం ప్రాంతానికి చెందిన బోర శివ, పెదబయలు మండలం గాదేపల్లి గ్రామానికి చెందిన లింగేరి రాజశేఖర్‌ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు.