నిషేధిత గుట్కాలు పట్టివేత

ABN , First Publish Date - 2021-04-12T21:44:29+05:30 IST

అనధికారికంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కాలను టూబాకో నియంత్రణ సంస్థ అధికారులు స్వాధీనం

నిషేధిత గుట్కాలు పట్టివేత

కృష్ణా: అనధికారికంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కాలను టూబాకో నియంత్రణ సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలను నిల్వ చేసారనే సమాచారం జిల్లా టూబాకో నియంత్రణ సంస్థ అధికారులకు అందింది. దీంతో కంచికచర్లలోని పలు దుకాణాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో అక్రమంగా నిల్వ చేసిన గుట్కా పాకెట్లను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-12T21:44:29+05:30 IST