గంజాయి ప్యాకెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-03-08T21:17:17+05:30 IST

నిషేధిత గంజాయిని తరలిస్తుండగా జిల్లాలోని సీలేరు పోలీసులు

గంజాయి ప్యాకెట్లు పట్టివేత

విశాఖ: నిషేధిత గంజాయిని తరలిస్తుండగా జిల్లాలోని సీలేరు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం దారకొండ నుంచి హైదరాబాదుకు కారులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందిందన్నారు. దీంతో సీలేరు జెన్ కో చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను సీలేరు పోలీసులు చేపట్టారు. వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దాదాపు 56 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారుతి స్విఫ్ట్ కారును, రెండు సెల్ ఫోన్లు, 7,750 రూపాయలను స్వాధీనం చేసుకుని వాటిని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా గంజాయిని సాగు చేసినా, రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-03-08T21:17:17+05:30 IST