కరోనా ఎఫెక్ట్: భూమాత బీపీ కూడా తగ్గిపోయింది!

ABN , First Publish Date - 2020-04-06T00:59:12+05:30 IST

కరోనా పుణ్యమా అని భూమాత కూడా శాంతించిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏంటీ అర్థం కాలేదా? అదేనండీ.. ఈ లాక్ డౌన్ల కారణంగా మానవ ప్రేరేపిత భూ ఉపరితల కంపనాలు కూడా నెమ్మదించాయట.

కరోనా ఎఫెక్ట్: భూమాత బీపీ కూడా తగ్గిపోయింది!

న్యూఢిల్లీ: కొన్ని వాస్తవాలు చేదుగా ఉంటాయి. కరోనా కూడా అంతే. ఉన్నదున్నట్టుగా చెప్పుకోవాలంటే.. మానవ సమాజానికి కరోనా మహమ్మారి ఎంత నష్టం చేస్తోందో ప్రకృతికి అంతగా మేలు చేస్తోంది. కరోనాకు భయపడి.. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుండటంతో మానవుడు చేసిన గాయాల నుంచి ప్రకృతి నెమ్మదిగా కోలుకుంటోంది. కాలుష్యం తగ్గుముఖం పడుతోంది. వాగులు, వంకలు శుభ్రమవుతున్నాయి. తాజాగా కరోనా పుణ్యమా అని భూమాత కూడా శాంతించిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏంటీ అర్థం కాలేదా? అదేనండీ.. ఈ లాక్ డౌన్ల కారణంగా మానవ ప్రేరేపిత భూ ఉపరితల కంపనాలు కూడా నెమ్మదించాయట. నిత్యం ప్రయాణించే కార్లు, రైళ్లు, ఇతర రవాణ వాహానాల కారణంగా భూమిలోని పొరల్లో ఒకటైన క్రస్ట్ కొద్దిగా కంపిస్తూ ఉంటుంది. సాకేంతిక పరిభాషలో దీన్ని సీస్ మిక్ నాయిస్ అంటారు. కాస్త కామెడీగా చెప్పుకోవాలంటే..ఈ  రైళ్లు గట్రా భూమాతకు కూడా బీపీ పెంచి దడపుట్టించేవి. మరోవైపు.. ఈ కంపనల కారణంగా మధ్యస్థ తీవ్రత కలిగిన భూకంపాలను పరిశోధించడంలో శాస్త్రవేత్తలు ఇబ్బంది పడేవారు. వాటి సునిశిత విశ్లేషణకు ఈ నాయిస్ అడ్డుపడేది..పానకంలో పుడటైపులో. ప్రస్తుతం లాక్ డౌన్ల కారణంగా సీస్‌మిక్ నాయిస్ తగ్గడంతో శాస్త్రవేత్తలు భూకంపాలను మరింత నిశితంగా పరిశోధించగలుగుతున్నారట.

Updated Date - 2020-04-06T00:59:12+05:30 IST