ప్రగతి సమావేశాలకు నిరసన సెగ!

ABN , First Publish Date - 2022-06-02T09:45:41+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఐదో విడత నిర్వహించే ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశాలకు సర్పంచుల నిరసన సెగ తాకింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మండలాల్లో

ప్రగతి సమావేశాలకు నిరసన సెగ!

మూకుమ్మడిగా బహిష్కరించిన సర్పంచులు

బకాయిలు చెల్లించడం లేదని నిరసన

వికారాబాద్‌ జిల్లాలో పలుచోట్ల ధర్నాలు 

సంగారెడ్డి జిల్లాలోనూ సర్పంచుల ఆందోళన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర ప్రభుత్వం ఐదో విడత నిర్వహించే ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశాలకు సర్పంచుల నిరసన సెగ తాకింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మండలాల్లో సర్పంచులు ఈ సమావేశాలను బహిష్కరించారు. దీంతో అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అభివృద్ధి పనుల బకాయిలు చెల్లించడం లేదని, నిధులు విడుదల చేయడం లేదని కొంతకాలంగా సర్పంచులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలను సర్పంచుల గైర్హాజరులోనే అధికారులు తూతూమంత్రంగా ముగించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో సమావేశానికి జడ్పీ చైర్మన్‌, డీఆర్‌డీవో, వివి ధ శాఖల అధికారులు హాజరైనా సర్పంచు లు మాత్రం రాలేదు. శాయంపేట మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌ను పలు మండలాల్లో సర్పంచులు బహిష్కరించారు. తమకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. తాండూరు, పెద్దేముల్‌, బషీరాబాద్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో సర్పంచులు వీడియో కాన్ఫరెన్స్‌ను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాము చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు కాక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నా తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల మూడో తేదీ నుంచి జరగనున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లాలో బహిష్కరిస్తామని సర్పంచుల ఫోరం ప్రకటించింది. కలెక్టర్‌ ఎం.హన్మంతరావు ఆధ్వర్యంలో బుధవారం కందిలో సమావేశం జరిగింది. దీనికి కంది మండలంలోని సర్పంచులతో పాటు సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి వచ్చారు. అయితే ఆహ్వానం లేని కారణంగా సర్పంచులను సమావేశానికి అనుమతించలేదు. గతంలో నాలుగు విడతల్లో జరిగిన పల్లె ప్రగతి సన్నాహక సమావేశాలకు తమను పిలిచి, ఈసారి ఎందుకు పిలవలేదని గోపాల్‌రెడ్డి అధికారులపై మండి పడ్డారు. గ్రామాల్లో పల్లె ప్రగతిని ఎలా నిర్వహిస్తారో చూస్తామని హెచ్చరించారు. పెండింగ్‌ బిల్లులను చెల్లించే వరకు పల్లెప్రగతిని బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచుల కుటుంబాలను ఆదుకోవాలని కోరు తూ గోపాల్‌రెడ్డితో పాటు పలువురు సర్పంచ్‌లు ప్లకార్డులను ప్రదర్శించారు. 

Updated Date - 2022-06-02T09:45:41+05:30 IST