అయ్యా సీఎం గారూ.. ఫామ్‌హౌస్‌కు రాకపోకలపై సీతక్క రిక్వెస్ట్

ABN , First Publish Date - 2020-10-18T16:35:46+05:30 IST

ప్రగతి భవన్ టు గజ్వేల్‌ ఫామ్ హౌస్... సీఎం కేసీఆర్ తరుచూ రాకపోకలు సాగిస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రయాణాల వల్ల వాహనాలను ఎక్కడి వక్కడే నిలుపుదల చేయిస్తుంటారు. దీనివల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంటుంది.

అయ్యా సీఎం గారూ.. ఫామ్‌హౌస్‌కు రాకపోకలపై సీతక్క రిక్వెస్ట్

ఇంటర్నెట్ డెస్క్: ప్రగతి భవన్ టు గజ్వేల్‌ ఫామ్ హౌస్... సీఎం కేసీఆర్ తరుచూ రాకపోకలు సాగిస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రయాణాల వల్ల వాహనాలను ఎక్కడి వక్కడే నిలుపుదల చేయిస్తుంటారు. దీనివల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంటుంది. భారీ కాన్వాయ్‌తో సీఎం ప్రయాణిస్తుంటారు. అది వెళ్లే వరకు వాహనాలను పోలీసులు నిలిపేస్తున్నారు. భారీ వర్షాల సమయంలోనూ ఇది ఇలాగే కొనసాగుతుండటంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీతక్క... ట్విట్టర్ వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు. 


‘‘అయ్యా ముఖ్యమంత్రి గారు... దయచేసి మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీసుకు రాకపోకలు సాగించకండి. మీ ప్రయాణాల వల్ల ఈ భారీ వర్షాల్లో 60 కిమీ. మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. పాపం వాళ్లు కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరాలి కదా.. ఓ సారి ఆలోచించండి’’ అని ట్వీట్ చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.   



Updated Date - 2020-10-18T16:35:46+05:30 IST