భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దిగజార్చడం సరికాదు: సీతక్క

ABN , First Publish Date - 2021-11-21T02:17:36+05:30 IST

ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.

భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దిగజార్చడం సరికాదు: సీతక్క

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దిగజార్చే విదంగా మాట్లాడటం సరికాదన్నారు. మొన్నటి వరకు అదే పార్టీలో ఉండి ఇప్పుడు వ్యక్తిగత స్వలాభాల కోసం విమర్శలు చేయడం సరికాదని తప్పుబట్టారు. ఒకరిద్దరు మహిళ ఎమ్మెల్యేలు చాలా అసభ్యంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. వారి మాటలు వింటే తాము మహిళలమేనా అన్న సందేశం కలుగుతుందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వ్యక్తిగత విలువలు కాపాడుకోవాలని సూచించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఒకప్పుడు టీడీపీ ఉన్నవారేనని సీతక్క గుర్తుచేశారు.

Updated Date - 2021-11-21T02:17:36+05:30 IST